Snake in Sofa: కొత్త సోఫాలో స్నేక్ బాబు బుస బుస.. కూర్చుంటే చచ్చేవాడే!
అతడు సోఫా కొని ఒక్క రోజు కూడా కాలేదు. కనీసం కూర్చోనైనా కూర్చోలేదు. లక్కీగా అందులో నుంచి వస్తు్న్న బుసలు బుసలు విని.. పాము ఉందని సందేహించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే..
టాయిలెట్లలోనే కాదు.. టైమ్ బాగోకపోతే సోఫాలో కూర్చున్నా పాములు కాటేయొచ్చు. ఔనండి.. ఓ వ్యక్తి ఇంట్లోకి దూరిన పాము నేరుగా సోఫాలోకి దూరింది. కాసేపు అందులో నక్కి ముప్పు తిప్పలు పెట్టింది. లక్కీగా ఆ ఇంటి యజమాని అది సోఫాలకు దూరేప్పుడు చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. అతడి పరిస్థితి ఎలా ఉండేదో.
ఫ్లొరిడాలోని మరిలైన్ పెనెస్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి భయం భయంగా క్లియర్‌వాటర్ పోలీసులకు ఫోన్ చేశాడు. వణుకుతున్న స్వరంతో.. తన ఇంట్లోకి పాము దూరిందని చెప్పాడు. దీంతో పోలీసులు పాములను స్నేక్ రెస్క్యూ టీమ్‌తో అతడి ఇంటికి చేరుకున్నారు. వారికి పాము ఎక్కడికి వెళ్లిందో కనిపించలేదు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన సోఫాలో ఆ పాము నక్కినట్లు సందేహంగా ఉందని చెప్పాడు.
Also Read: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ..
సోఫా వెనుక చిన్న కన్నం ఉండటంతో.. ఆ పాము అందులోకి దూరి ఉంటుందని భావించారు. సోఫాను పైకెత్తి సోదా చేశారు. అతడు ఊహించిందే నిజమైంది. ఓ పాము సోఫాలోని స్ప్రింగ్స్ మధ్యలో నక్కి ఉంది. మొత్తానికి ఆ సోఫా క్లాత్‌ను తొలగించి దాన్ని బయటకు తీశారు. ఎర్ర రంగు తోకతో ఉన్న ఆ పాము బోవా కన్స్ట్రిక్టర్ అని తెలుసుకున్నారు. అయితే, ఇది కాటేసే రకం ఫోన్ కాదు. దీనికి చిక్కిన జీవిని తాకతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత అమాంతంగా మింగేస్తుంది. లక్కీగా అతడికి ఆ సోఫాలో పాము ఉందనే సందేహం కలిగింది. అది తెలియక దానిపై కూర్చొని ఉంటే సీన్ వేరేలా ఉండేదేమో. సోఫా నుంచి తీసిన పామును స్థానిక పెట్ షాప్‌కు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది.
Also Read: డామ్ ఇట్.. శృంగారానికి దూరమైతే ఇన్ని దారుణమైన సమస్యలా?
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి