X

డామ్ ఇట్.. శృంగారానికి దూరమైతే ఇన్ని దారుణమైన సమస్యలా?

శృంగార జీవితం బోరు కొట్టిందా? పూర్తిగా ఆ ఆలోచనే మానుకున్నారా? అయితే, మీరు మీ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్లే.

FOLLOW US: 

నిషి మనుగడకు ఆహార, పానీయాలు ఎంత అవసరమో.. సెక్స్ కూడా అంతే అవసరం. సెక్స్ లేకపోతే ఈ సృష్టే ఉండదు. కానీ, దీన్ని చాలామంది తప్పుగా భావిస్తారు. ఆలుమగల మధ్య జరిగే ఏకాంత కార్యాన్ని బహిరంగంగా చర్చించడం తప్పనుకుంటారు. కానీ, అది ఏ మాత్రం తప్పు కాదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దీనిపై తప్పకుండా అవగాహన పెంచుకోవాలి. సెక్స్‌ను తప్పుడు కోణంలో కాకుండా.. ఆరోగ్యాన్ని అందించే ఔషదంగా భావించాలి. బిజీ లైఫ్ వల్ల చాలామంది సెక్స్‌కు దూరమవుతున్నారు. కరోనా వైరస్.. లాక్ డౌన్ వల్ల అంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కొందరు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరికొందరు మాత్రం.. ఆ ఏకాంత ఔషదానికి పూర్తిగా దూరమయ్యారు. స్పర్థలు, ఒత్తిడి, ఆసక్తి లేకపోవడం తదితర కారణాల వల్ల చాలామంది పడక గది సుఖానికి దూరమవుతున్నారు. దీనివల్ల చాలా కోల్పోతున్నారు. కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సెక్స్ ఆపేయడం వల్ల కలిగే ఈ సమస్యలు గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 

ఎంగ్జైటీ (anxiety) లేదా ఆత్రుత పెరుగుతుంది: తీవ్రమైన ఒత్తిడి వల్ల చాలామంది ఎంగ్జైటీగా ఫీలవుతారు. అలాంటివారు సెక్స్ మీద కూడా ఆసక్తి చూపరు. కానీ, సెక్స్ చేయడం వల్ల ఆత్రుత తగ్గి.. మనసు హాయిగా ఉంటుంది. ఆందోళన తగ్గించేందుకు సెక్స్ ఉపయోగపడుతుంది. సెక్స్ వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల పరిమాణం తగ్గుతుంది. చురుకైన లైంగిక జీవితం మిమ్మల్ని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆత్రుతను దూరం చేయడానికి సహకరిస్తుంది.  

గుండె జబ్బులు పెరుగుతాయి: వారానికి రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసేవారి కంటే నెలకు ఒకసారి లేదా అంతకంటే తక్కువ సార్లు సెక్స్ చేసేవారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు సెక్స్‌కు కాస్త సమయాన్ని కేటాయిస్తే.. శరీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరానికి మంచి వ్యాయమం లభించడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

వ్యాయామానికి దూరమైనట్లే..: సెక్స్‌కు దూరం కావడమంటే.. వ్యాయామాన్ని మానేసినట్లే. ఎందుకంటే సెక్స్ వల్ల నిమిషానికి ఐదు క్యాలరీలు ఖర్చవుతాయి. మీ శరీరానికి తగిన ఆక్సిజన్ కూడా లభిస్తుంది. ఇది ఇంట్లో మెట్లు, ఎక్కి దిగినప్పుడు ఖర్చయ్యే అంత క్యాలరీలతో సమానం. అలాగే మీ మెంటల్ హెల్త్‌ మెరుగవుతుంది. అలాగే సెక్స్ జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుంది. 

రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది: ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనేవారితో పోల్చితే.. తక్కువ సెక్స్ చేసేవారు లేదా పూర్తిగా సెక్స్ చేయనివారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ వల్ల సూక్ష్మక్రిములతో పోరాడే ఇమ్యునోగ్లోబులిన్ A, లేదా IgA అనే పదార్థాల స్థాయి పెరుగుతుంది. కానీ, అతిగా చేసిన సమస్యే అంటున్నారు నిపుణులు. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ సెక్స్ చేసే వ్యక్తులు తక్కువ IgA స్థాయిలను కలిగి ఉంటారని అంటున్నారు. 

ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం..: ఒక నెలలో 21 సార్లు సెక్స్ చేసే వ్యక్తులతో పోల్చితే.. నెలలో ఏడు సార్లు కంటే తక్కువ సెక్స్ లేదా స్కలనం చేసే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే, అసురక్షిత సెక్స్, విచ్చలవిడి శృంగారం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. కాబట్టి సెక్స్ చేసేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. 

నిద్రలేమి సమస్యతో బాధపడతారు: సెక్స్ తక్కువగా చేయడం వల్ల నిద్ర లేదా విశ్రాంతికి ప్రేరేపించే ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ తరహా హర్మోన్ల సంఖ్య తగ్గుతుంది. సెక్స్ వల్ల ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ మహిళలకు మరింత మేలు చేస్తుంది. కాబట్టి.. మీకు మంచి నిద్ర కావాలంటే రాత్రివేళ భోజనం చేసిన గంటన్నర తర్వాత ప్రయత్నించండి. 

నొప్పులను దూరం చేస్తుంది: సెక్స్‌తో కొన్ని రకాల నొప్పులకు దూరం కావచ్చు. సెక్స్ వల్ల కలిగే ఉద్వేగం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ తదితర హార్మోన్లు ఉత్పత్తవుతాయి. ఈ హార్మోన్లు తల, వెన్ను, కాళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడతాయి. ఆర్థరైటిస్ నొప్పితో బాధపడేవారికి సెక్స్ మంచి ఔషదమని నిపుణులు తెలుపుతున్నారు. సెక్స్ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. 

Also Read: ఛీ.. దరిద్రుడు, కారు నడుపుతూ డ్రైవర్ పాడుపని.. మహిళకు ఊహించని చేదు అనుభవం

లైంగిక సమస్యలు ఏర్పడతాయి: “use it or lose it” అనేది సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా మహిళ్లలో 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో వచ్చే మెనోపాజ్‌ సమస్య వల్ల యోని కణజాలం సన్నబడటం లేదా కుచించుకుపోవచ్చు. రెగ్యులర్ సెక్స్‌కు దూరం కావడం వల్ల యోని పొడిబారుతుంది. దానివల్ల సెక్స్ చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. దానివల్ల మహిళలు సెక్స్ అంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎక్కువ రోజులు సెక్స్‌కు దూరంగా ఉండే పురుషులకు అంగస్తంభన సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి.. వారంలో కనీసం ఒక్కసారైనా సెక్స్‌కు సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండండి. 

Read also:  ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Read also:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Relationship Problems Relationship Adult problems Bed Room Problems రిలేషన్‌షిప్ సమస్యలు

సంబంధిత కథనాలు

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...