By: Haritha | Updated at : 11 Jul 2022 02:53 PM (IST)
(Image credit: Twitter)
మీకు తెలిసిన మేరకు ఒక ఆటోలో ఎంత మంది కూర్చోగలరు? రూల్స్ ప్రకారం అయితే ముందుకు ఒక డ్రైవర్, వెనుక త్రీ సీటర్ పై ముగ్గురు వ్యక్తులు కూర్చోవచ్చు. అయితే మధ్యలో చిన్న సీటులా వేసి మరో ముగ్గురిని కూర్చోబెట్టేస్తున్నారు. అలాగే డ్రైవర్ తన చెరో పక్క మరో ఇద్దరినీ కూర్చోబెట్టుకుంటున్నాడు. అంటే డ్రైవర్ కాకుండా ఎనిమిది మందిని ఇరికించి కూర్చోబెట్టి తీసుకెళ్లిపోతున్నారు ఆటో డ్రైవర్లు. కానీ ఓ డ్రైవర్ ఏకంగా ఒక బస్సులో పట్టేంత మందిని ఆటోలో కుక్కేశాడు. ఎంత మందో తెలుసా? అక్షరాలా 27 మంది. పోనీ ఆ ఆటో వెనుక కూడా కూర్చోవడానికి వీలుంటే షేర్ ఆటో కాదు, సాధారణ ఆటో.
ఎక్కడ?
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో జరిగింది. నిండు గర్భిణిలా వస్తున్న ఆ ఆటో పోలీసు వాళ్ల కళ్లల్లో పడింది. ఎక్కువ ప్యాసింజర్లతో వస్తున్నట్టు గురించి ఆపారు. వారు ఆ ఆటోలో పదిమంది ఉంటారని ఊహించారు. తీరా ఆపి ఒక్కొక్కరినీ దించి లెక్క పెడితే పోలీసోళ్ల బుర్ర గిరగిరా తిరిగింది. మొత్తం 27 మంది. అందులో సగం మంది పిల్లలే. ఆ కుటుంబానికి బుద్ధి లేదా అంటూ చీవాట్లు పెట్టారు పోలీసు వాళ్లు. ఇక ఆటోడ్రైవర్ ను చూసి అంతెత్తున లేచాడు ఎస్‌ఐ. అతను ఏదో చెప్పబోతుంటే ‘నోర్ముయ్’ అంటూ అరిచాడు.
जनसंख्या विस्फोट का दुष्परिणाम
ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp
">
ఈ మొత్తం తతంగాన్ని ఎవరో వీడియో తీసి ట్విట్టర్లో పోస్టు చేశారు. అప్పట్నించి అది వైరల్ అయింది. ఆటోకి ఏదైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ‘బస్సనుకున్నాడా? ఆటో అనుకున్నాడా?’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరం. తక్కువ ఖర్చుతోనే గమ్యస్థానాలకు చేరిపోవచ్చనే ఉద్ధేశంతోనే ఎక్కువమంది ఒకే ఆటోలో ఇరుక్కుపోయిన కూర్చుంటారు. కానీ జరగకూడనిది జరిగితే తిరిగి ప్రాణాలు రావు. కాబట్టి కాసుల కక్కుర్తి మానేసి సురక్షిత ప్రయాణాలు చేయండి.
Also read: కేజీయఫ్‌ను మించి పోయిన బంగారు గని, ఇదే ప్రపంచంలో అతి పెద్దది, ఎక్కడుందో తెలుసా?
Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు
Iron Kadhai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?
Fish Oil Vs Fish: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?
Heart Attack: ఈ రక్తపరీక్షతో గుండె పోటు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు
Dark Chocolates: షాకింగ్, ఈ చాక్లెట్‌లో భారీ లోహాలు - అవి తింటే ప్రమాదకరమా?
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే తక్కువ ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
/body>