News
News
వీడియోలు ఆటలు
X

UPSC CDS Notification: సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (II) - 2023 నోటిఫికేషన్ విడుదల - త్రివిధ దళాల్లో 349 ఖాళీలు!

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసింది. మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు..

FOLLOW US: 
Share:

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

పోస్టుల వివ‌రాలు...

* కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్‌) ఎగ్జామినేష‌న్ (II)-2023

ఖాళీల సంఖ్య: 349

అకాడమీల వారీగా ఖాళీలు..

➥ ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100

➥ ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 32

➥ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై: 169

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై: 16

అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టుల భర్తీకి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో ఫిజిక్స్‌, మ్యాథ‌మెటిక్స్ స‌బ్జెక్టుల‌ు చదివి ఉండాలి. 

వయోపరిమితి..

➥ ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీకి 02.07.2000 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥  ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 01.07.2024 నాటికి  20-24 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.2000 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. 

➥ డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 02.07.1998 -01.07. 2004 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక‌ విధానం: రాత ప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పరీక్ష విధానం: ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు.  ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు, మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. వీరికి 200 మార్కులకే రాతపరీక్ష ఉంటుంది.  

ఇంటర్వ్యూ విధానం: ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది.  ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2023.

➥ నేరుగా ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.06.2023.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.06.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2023. (6:00 PM)

➥ దరఖాస్తుల ఉపసంహరణ: 07.06.2023 - 13.06.2023.

➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 16.04.2023.

➥ ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: 2023, ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో.

➥ కోర్సులు ప్రారంభం: 02.01.2024.

Notification

Online Application

                                     

Also Read:

యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (II)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. ఇక ద్వితియార్ధానికి సంబంధించి సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 18 May 2023 07:11 AM (IST) Tags: UPSC CDSE Examination CDSE Examination 2023 upsc cds examination (II) 2023 combind defence services exam(II) 2023

సంబంధిత కథనాలు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి