News
News
వీడియోలు ఆటలు
X

UPSC NDA & NA Notification: యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం!

ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో వచ్చే ఏడాది జులై 2 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీలో 114వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 

FOLLOW US: 
Share:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (II)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. ఇక ద్వితియార్ధానికి సంబంధించి సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

శిక్షణ‌తోపాటు త్రివిధ ద‌ళాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాల్లో 2024, జులై 2 నుంచి ప్రారంభమయ్యే 152వ కోర్సులో, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) 114వ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో నియమిస్తారు. 

పోస్టుల వివరాలు...

* ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2023 

ఖాళీల సంఖ్య: 395 

పోస్టుల కేటాయింపు..

➥ నేషనల్ డిఫెన్స్ అకాడమీ-208 పోస్టులు (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్-120). వీటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. 

➥ నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) 25 ఖాళీలు.

అర్హత: ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇక నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: అభ్యర్థులు 02.01.2005 - 01.01.2008 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం..

మొత్తం 1800 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 900 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మిగతా 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. వీటిలో పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, అనంతపురం.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2023.

➥  ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.06.2023. (రాత్రి 23.59 వరకు) 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.06.2023. (సాయంత్రం 6 గంటల్లోగా)

➥ దరఖాస్తుల ఉపసంహరణ: 07.06.2023 - 13.06.2023.

➥ ఆన్‌లైన్ రాత పరీక్ష: 03.09.2023. 

➥ కోర్సులు ప్రారంభం: 02.07.2024.

Notification

Online Application

                             

Also Read:

ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 17 May 2023 05:33 PM (IST) Tags: UPSC Indian Navy Indian Army Indian Air Force nda & na Naval Academy National Defence Academy

సంబంధిత కథనాలు

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

Intel: ఇంటెల్‌లో గ్రాడ్యుయేట్ ఇంటర్న్ ఉద్యోగాలు- అర్హతలివే!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!