By: ABP Desam | Updated at : 21 Mar 2023 06:34 PM (IST)
Edited By: omeprakash
ఆశావర్కర్ పోస్టులు
తెలంగాణలో 1540 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆశా వర్కర్ల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ ఉత్తర్వులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో షేర్ చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు హర్షం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు.
జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్ పరిధిలో 323, మేడ్చల్‌లో 974, రంగారెడ్డి పరిధిలో 243 పోస్టులను భర్తీచేయనుంది. ఈ ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
Elated to announce another step towards strengthening primary healthcare in Telangana under the leadership of Hon’ble CM Shri #KCR Garu. #Telangana Govt accorded permission for filling up 1540 ASHA’s posts (Health care workers) in GHMC area limits through the district… https://t.co/ixQTEeqYKh pic.twitter.com/3MfjWazn7i
— Harish Rao Thanneeru (@BRSHarish) March 21, 2023
Also Read:
ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 23, 24 తేదీల్లో ఐబీల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-1 రాతపరీక్ష నిర్వహించనడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) స్టెనో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్‌లోని లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏఎస్ఐ స్టెనో ఉద్యోగాల భర్తీకి మార్చి 27న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!
TS Group-1: రేపే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
PNB SO Application: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!