BSF Constable Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
![BSF Constable Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా! BSF Tradesman Recruitment 2023: Notification for 1284 vacancies released, check here BSF Constable Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/27/e3807d8c2e7ce16388835800904ea21b1677522455272522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) పోస్టులు
మొత్తం ఖాళీలు: 1284 (మెన్: 1220, ఉమెన్: 64)
విభాగాలు: కోబ్లర్, టైలర్, వాషర్‌మన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్; తదితరాలు.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కొన్ని ట్రేడుల్లో ఎన్‌ఎస్‌క్యూఎఫ్ లెవల్-1 కోర్సు పూర్తి చేయాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలోనే పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాతి దశలో అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాలి. కానీ అందుకు ఎలాంటి మార్కులు ఉండవు.
జీతభత్యాలు: నెలకు రూ.21700-రూ.69100 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.03.2023.
Also Read:
TSSPDCL: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి జనవరి 17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిభ్రవరి 23న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)