News
News
వీడియోలు ఆటలు
X

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 23, 24 తేదీల్లో ఐబీల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-1 రాతపరీక్ష నిర్వహించనడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది. 

కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 1675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 దరఖాస్తులు స్వీకరించింది. టైర్-1, టైర్-2, టైర్-3 రాతపరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. 

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

టైర్-1 పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 5 విభాగాలుంటాయి. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటి & రీజనింగ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ స్టడీస్ -20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 4 తప్పుడు సమాధానానికి ఒకమార్కు అంటే ప్రతి తప్పు సమాధానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. 

టైర్-2 పరీక్ష విధానం: టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో 40 మార్కులకు 'టైర్-2' పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష పూర్తిగా ఆఫ్‌‌లైన్ (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. ఇందులో అభ్యర్థులు 500 పదాలతో కూడిన ప్యాసేజీని స్థానిక భాష నుండి ఇంగ్లిష్‌లోకి అనువాదం (ట్రాన్స్‌లేట్) చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లిష్ నుంచి స్థానిక భాషలోకి అనువాద చేయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. అయితే టైర్-2లో కేవలం సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ మాత్రమే 10 మార్కులకు స్పోకెన్ ఎబిలిటి టెస్ట్ నిర్వహిస్తారు. టైర్-3లో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టుకు సంబంధించి అభ్యర్థులు సామర్థ్యం అంచనావేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.

టైర్-3 పరీక్ష విధానం: టైర్-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు టైర్-3లో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టు నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. 

నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Mar 2023 10:48 AM (IST) Tags: Intelligence Bureau admit card 2023 IB SA Admit Card 2023 IB MTS Admit Card 2023 IB Hall Ticket 2023 IB Admit Card 2023 IB Admit Card download IB Admit Card 2023

సంబంధిత కథనాలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Recruitment: బెల్‌లో 205 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

BEL Jobs: బీఈఎల్‌లో ప్రొబేషనరీ, సీనియర్ ఇంజినీర్‌ పోస్టులు, అర్హతలివే!

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

GDS Recruitment: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు ఇక నాలుగు రోజులే గడువు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం