IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు, టెన్త్ అర్హత చాలు! దరఖాస్తు ఎప్పుడంటే?
ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
![IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు, టెన్త్ అర్హత చాలు! దరఖాస్తు ఎప్పుడంటే? Intelligence Bureau recruitment 2023 for 1675 vacancies: check posts, qualification and other details IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 ఉద్యోగాలు, టెన్త్ అర్హత చాలు! దరఖాస్తు ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/404df8cddf30c2b0de14d09f23d30d8a1674139649897522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 1675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకూడదు.
ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2, టైర్-3 రాతపరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 1675
1) సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 1525 పోస్టులు
2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్: 150 పోస్టులు
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి: 10.2.2023 నాటికి సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలలోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 రాతపరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.01.2023.
Notification:
Also Read:
'టెన్త్' అర్హతతో 11,409 ఉద్యోగాలు, ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో దాదాపు 11 వేలకు పైగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 18న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు - NCC స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్ వెల్లడి!
ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 54వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2023 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 17న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 15తో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)