అన్వేషించండి

SSC MTS Notification: 'టెన్త్' అర్హతతో 11,409 ఉద్యోగాలు, ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది!

ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో దాదాపు 11 వేలకు పైగా మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు.

కేంద్రప్రభుత్వ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో దాదాపు 11 వేలకు పైగా మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 18న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పోస్టుల వివరాలు..

✪ మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నిక‌ల్‌) స్టాఫ్ ఎగ్జామినేషన్ - 2022

మొత్తం ఖాళీల సంఖ్య: 11,409

1) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 10,880 పోస్టులు

2) హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 529 పోస్టులు (హైదరాబాద్-8)

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1998 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.01.1996 - 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

కరెక్షన్ ఫీజు: దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మొదటిసారి రూ.200, రెండోసారి అయితే  రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తుల సమయంలో పొరపాట్లు లేకుండా వివరాలు నమోదచేయడం మంచిది.

పరీక్ష విధానం..

✦ మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు.  120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.   

✦ రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.

✦ పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20%  గా నిర్ణయించారు.

✦ మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

✦ హవిల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  18.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.02.2023 (23.00)

➥ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.02.2023 (23.00)

➥ ఆఫ్‌లైన్ చలనా జనరేట్ చేసుకోవడానికి చివరితేది: 19.02.2023 (23.00)

➥ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 20.02.2023.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 23.02.2023 - 24.02.2023 (23:00)

➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: ఏప్రిల్, 2023.

Notification

Online Application 

Also Read:

1458 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న  ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 

డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు - NCC స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ వెల్లడి!
ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 54వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2023 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 17న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 15తో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget