CRPF Recruitment: 1458 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.
![CRPF Recruitment: 1458 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు! వెంటనే దరఖాస్తు చేసుకోండి! CRPF Recruitment 2023: Apply online for 1458 Head Constable, ASI Steno Posts CRPF Recruitment: 1458 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/65d566f2f35bbf643e5df954414148b21674041821125522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ మొత్తం ఖాళీలు: 1458 పోస్టులు
➛ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 143 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.01.2023.
➥ సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 15.02.2023.
➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 22-28 మధ్య.
Also Read:
వరంగల్ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)