By: ABP Desam | Updated at : 28 Dec 2022 03:21 PM (IST)
Edited By: omeprakash
నిట్ వరంగల్ టీచింగ్ పోస్టులు
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100
పోస్టుల కేటాయింపు: జనరల్-38, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-26, ఎస్సీ-10, ఎస్టీ-08.
పోస్టుల వారీగాఖాళీలు..
➥ ప్రొఫెసర్: 12
➥ అసోసియేట్ ప్రొఫెసర్: 52.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-I): 13.
➥అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 14.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-II): 9.
విభాగాలవారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్ - 16, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 06, మెకానికల్ ఇంజినీరింగ్ - 05, ఈసీఈ - 11, మెటలర్జికల్ ఇంజినీరింగ్ - 08, కెమికల్ ఇంజినీరింగ్ - 08, సీఎస్ఈ - 26, బయోటెక్నాలజీ - 04, మ్యాథమెటిక్స్ - 04, ఫిజిక్స్ - 04, హ్యుమానిటిస్ - 01, ఎస్‌వోఎమ్ - 06, సీసీపీడీ - 01.
అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీటెక్/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 35-50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైనతేదీలు..
↪ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.12.2022.
↪ దరఖాస్తు చివరి తేది: 25.01.2023.
Also Read:
ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెండు స్టాచ్యుటరీ పోస్టులు, గ్రూప్-ఎ విభాగంలో 6 పోస్టులు, గ్రూప్-బి విభాగంలో 21 పోస్టులు, గ్రూప్-సి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
NITK Recruitment: నిట్-కురుక్షేత్రలో నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!