SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు.
పోస్టుల వివరాలు..
* కలెక్షన్ ఫెసిలిటేటర్: 1438 పోస్టులు (హైదరాబాద్-135, హైదరాబాద్-51)
పోస్టుల కేటాయింపు: జనరల్-680, ఈడబ్యూఎస్-125, ఓబీసీ-314, ఎస్సీ-198, ఎస్టీ-121.
అర్హత: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబరు 2022 నాటికి 63 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఎస్‌బీఐ రిటైర్డ్ అధికారి, సిబ్బంది, ఇతరులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి క్లీన్ రికార్డ్ కలిగి ఉండాలి. వారికి కేటాయించిన విధులలో వారికి పూర్తి నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి: 22.12.2022 నాటికి 63 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్టింగ్ కమిటీ షార్ట్‌లిస్టింగ్ నిబంధనలని అనుసరించి అభ్యర్థులు షార్ట్ లిస్ట్ జాబితాను తయారుచేస్తుంది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. వీరికి 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సాధారణ కట్-ఆఫ్ నంబర్‌ను పొందినట్లయితే, వారి మెరిట్ వయసు ప్రకారం ఉద్యోగం కేటాయిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: ఉద్యోగి పనితీరుపై త్రైమాసిక సమీక్ష నిర్వహిస్తారు. 65 ఏళ్లు నిండిన పదవీ విరమణ చేసిన అధికారులు/సిబ్బందికి ఏది ముందు అయితే.. కాంట్రాక్టు కనిష్టంగా ఒక సంవత్సరం, గరిష్టంగా 3 సంవత్సరాలు ఉంటుంది.
జీతం: క్లరికల్ కేడర్ వారికి రూ.25,000; జేఎంజీఎస్-I కేడర్ వారికి రూ.35,000; ఎంఎంజీఎస్-I, ఎంఎంజీఎస్-II కేడర్ వారికి రూ.40,000 ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.12.2022.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2023.
Also Read:
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో నాన్-టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెండు స్టాచ్యుటరీ పోస్టులు, గ్రూప్-ఎ విభాగంలో 6 పోస్టులు, గ్రూప్-బి విభాగంలో 21 పోస్టులు, గ్రూప్-సి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ, పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.