By: ABP Desam | Updated at : 18 Apr 2023 10:49 PM (IST)
Edited By: omeprakash
ఎస్‌బీఐ పీవో తుది ఫలితాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు ఏప్రిల్ 18న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 30న మెయిన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను మార్చి 10న విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫేజ్-3లో భాగంగా ఏప్రిల్‌లో గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలు నిర్వహించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల తుది జాబితాను సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం తాజాగా ప్రకటించింది.
గతేడాది సెప్టెంబరులో ఎస్‌బీఐ ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1673 పోస్టుల్లో 1600 రెగ్యులర్ కాగా.. 73 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. మొదటి రెండు దశల్లో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి.. తర్వాతి దశలో గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను పూర్తి చేసి తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌లను ఈ పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.
Letter To Successful Candidates
Main Exam – Marks Secured By The Candidate
మూడో దశ ఇలా నిర్వహించారు..
సైకోమెట్రిక్ టెస్ట్: అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.
తుది ఎంపిక ఇలా: మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్