SSC CPO 2023: ఎస్ఎస్సీ సీపీవో ఫిజికల్ ఈవెంట్స్ అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
రీజియన్లవారీగా సంబంధిత వెబ్‌సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రోల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్‌ఐ పోస్టులతోపాటు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఫిజికల్ ఈవెంట్లకు (PET/PST) సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. రీజియన్లవారీగా సంబంధిత వెబ్‌సైట్లలో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రోల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సదరన్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్, నార్త్-ఈస్ట్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, నార్త్-వెస్ట్ రీజియన్లకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.
సదరన్ రీజియన్ (SSC SR) అడ్మిట్ కార్డు
కర్ణాటక-కేరళ రీజియన్ (SSC KKR) అడ్మిట్ కార్డు
నార్త్-ఈస్ట్ రీజియన్ (SSC NER) అడ్మిట్ కార్డు
ఈస్టర్న్ రీజియన్ (SSC ER) అడ్మిట్ కార్డు
నార్త్-వెస్ట్ రీజియన్ (SSC NWR) అడ్మిట్ కార్డు
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 4300 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2022) విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 9 నుంచి 11 వకు సీపీవో రాతపరీక్ష నిర్వహించింది. రాతపరీక్ష ఫలితాలను డిసెంబరు 27న వెల్లడించింది.
రాతపరీక్షలో మొత్తం 68364 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 63,945 మంది పురుషులు, 4419 మంది స్త్రీలు అర్హత సాధించారు. తాజాగా ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తమ వెంట తెచ్చుకోవాలి. అడ్మిట్‌కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీకార్డు, విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లడం మంచింది.
Note: ఢిల్లీ పోలీసు ఎస్‌ఐ ఉద్యోగార్థులు ఫిజికల్ ఈవెంట్లకు వచ్చేప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ (లైట్ మోటార్ వెహికిల్) తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. లైసెన్స్ లేనిదే ఫిజికల్ ఈవెంట్లకు అనుమతి ఉండదు.
Also Read:
'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 451 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి - దరఖాస్తు ప్రారంభం!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమైంది. అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియన్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..