Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
![Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి! Indian Navy Invites Applications From Unmarried Male & Female Candidates for Short Service Commission In Information Technology (Executive Branch) – Jun 23 Course Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/f14cdc9fbe9a1e39953709c18dcb0b5c1674559730818522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇండియన్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 70
➨ ఇండియన్ నేవీ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచి) - జూన్ 2023
అర్హతలు..
➥ ఎంఎస్సీ/ బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఐటీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/సైబర్ సెక్యూరిటీ/సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) (లేదా) బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)తోపాటు ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
➥ పదోతరగతి, ఇంటర్ స్థాయిలో ఇంగ్లిష్‌లో కనీసం 60 మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వయోపరిమితి: 02.07.1998 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ వివరాలు: ఎంపికైనవారికి ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో 4 వారాల శిక్షణనిస్తారు. ఈ సమయంలో నేవల్ షిప్స్,ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అంశాల మీద శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.02.2023.
Also Read:
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 21 నంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, వీరికి ప్రత్యేకం! ఈ అర్హతలు ఉండాలి!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నల్సార్ లా యూనివర్సిటీలో రిసెర్చ్ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా రిసెర్చ్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, జనవరి 29తో దరఖాస్తు గడువు ముగియనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)