By: ABP Desam | Updated at : 22 Jan 2023 05:12 PM (IST)
Edited By: omeprakash
యూబీఐ ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 42
పోస్టుల వారీగా ఖాళీలు..
1) చార్టర్డ్ అకౌంటెంట్: 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-01, ఓబీసీ-02.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి.
అనుభవం: చార్టర్డ్ అకౌంటెంట్‌గా కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
2) సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 34 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-10, ఎస్టీ-13, ఓబీసీ-11.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి.
అనుభవం: కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
3) మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-05.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి.
అనుభవం: కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఫ్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కేటాయిస్తారు.
➥ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 3 : 1 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
➥ పర్సనల్ ఇంటర్యూకు 50 మార్కులు, గ్రూప్ డిస్కషన్‌కు 50 మార్కులు ఉంటాయి. వాటిల్లో కనీస అర్హత మార్కులను ఒక్కోదానిలో 25గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 22.5 మార్కులుగా నిర్ణయించారు
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2023.
➥ దరఖాస్తు చివరి తేది:12.02.2023.
Also Read:
ఎల్‌ఐసీలో 9394 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఎంపికైతే నెలకు 90 వేల రూపాయల జీతం!
లైఫ్ ఇన్‌స్య్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్