WCL Recruitment: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!
ఈ నోటిఫికేషన్ ద్వారా 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
![WCL Recruitment: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే! western coalfields has released notification for the recruitment of 135 mining sirdar and surveyor posts WCL Recruitment: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/22/3d33c5156a38a59782562669b924c1c91674380439743522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 21 నంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 135
1) మైనింగ్ సర్దార్: 107 పోస్టులు
విభాగం: టెక్నికల్ అండ్ సూపర్ వైజరీ (గ్రేడ్-సి).
అర్హత: పదోతరగతితోపాటు డీజీసీఎం జారీ చేసిన వ్యాలిడ్ మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్(లేదా) మైనింగ్/మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయోపరిమితి: 19.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2) సర్వేయర్-మైనింగ్: 28 పోస్టులు
విభాగం: టెక్నికల్ అండ్ సూపర్ వైజరీ (గ్రేడ్-బి).
అర్హత: పదోతరగతితోపాటు డీజీఎంఎస్ జారీ చేసిన సర్వేయర్స్(లేదా) మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 19.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ తీసి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ లేదు.
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-50 మార్కులు, ఓబీసీ-45 మార్కులు, ఎస్సీ-ఎస్టీలకు 40 మార్కులుగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.02.2023.
➥ స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.02.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
General Manager (P/IR),
Industrial Relations Department,
Coal Estate, Civil Lines,
Nagpur - 440001.
Also Read:
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వ రవాణా విభాగంలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల్లోపు పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏప్రిల్ 23న రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే? పోస్టుల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత కూడా ఉండాలి. అభ్యర్థులు ఫీజుగా రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)