CISF Constable Recruitment: 'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 451 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి - దరఖాస్తు ప్రారంభం!
అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమైంది. అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 451
1) కానిస్టేబుల్/ డ్రైవర్: 183 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-76, ఎస్సీ- 27, ఎస్టీ- 13, ఓబీసీ- 49, ఈడబ్ల్యూఎస్-18.
2) కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్): 268 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-111, ఎస్సీ- 40, ఎస్టీ- 19, ఓబీసీ- 72, ఈడబ్ల్యూఎస్-26.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్/ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్/ లైట్ మోటార్ వెహికల్/ మోటార్ సైకిల్ విత్ గేర్) తప్పనిసరిగా ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 22.02.2023 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
జీత భత్యాలు: నెలకు రూ.21,700 - రూ.69,100.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2023.
Also Read:
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియన్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
https://telugu.abplive.com/jobs/indian-navy-invites-applications-from-unmarried-male-female-candidates-for-short-service-commission-in-information-technology-executive-branch-jun-23-course-74573
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 21 నంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..