అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SSC CGLE 2021 Results: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ 2021 'టైర్‌-3' ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 34,992 మంది అభ్యర్థులు ఎంపిక!

మొత్తం 5 జాబితాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. అన్ని జాబితాలు కలిపి మొత్తం 34,992 మంది అభ్యర్థులు తర్వాత దశకు ఎంపికయ్యారు.

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2021 (టైర్-3) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) డిసెంబర్‌ 20న విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ గత ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో టైర్‌-3 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 7686 ఏఏవో, జేఎస్‌వో, ఎస్‌ఐ ఖాళీల నియామకాలు ఎస్‌ఎస్‌సీ చేపడుతోంది. 

'టైర్‌-3'లో ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన, నైపుణ్య పరీక్ష (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్)లకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. టైర్-3 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు 2023, జనవరి 4, 5 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తేదీలు సంబంధిత కమీషన్ ప్రాంతీయ కార్యాలయాలను వెల్లడించనున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉపయోగించి మార్కుల వివరాలను డిసెంబర్ 30 నుంచి జనవరి 13 వరకు చూసుకోవచ్చు. 

మొత్తం 5 జాబితాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. అన్ని జాబితాలు కలిపి మొత్తం 34,992 మంది అభ్యర్థులు తర్వాత దశకు ఎంపికయ్యారు. మొదటి జాబితాలో ఏఏవో పోస్టులకు 2567 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండో జాబితాలో 504 మంది అభర్థులు జేఎస్‌వో పోస్టులకు అర్హత సాధించారు. మూడో జాబితాలో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 2448 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్టులో ఉన్నారు. నాలుగో జాబితాలో సీపీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన 7197 మంది అభ్యర్థులు, ఇక చివరిదైనా 5వ జాబితాలో డీఈఎస్‌టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన 22,203 మంది అభ్యర్థులు ఉన్నారు. అన్ని జాబితాల్లో కలిపి 19 మంది అభ్యర్థుల ఫలితాలను పలు కారణాల వల్ల పెండింగ్‌లో ఉంచారు.

SSC CGLE 2021 TIER-II ఫలితాలను ఇలా చూసుకోండి..

Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Results' టాబ్ మీద క్లిక్ చేయాలి.

Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Combined Graduate Level Examination (Tier-III), 2021' ఫలితాలకు సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి. మొత్తం 5 జాబితాల్లో అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.

Step 4: ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. 

Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు. 

Step 6: ఫలితాలు చూసుకోవడానికి కంప్యూటర్ కీబోర్డులో "Ctrl + F" కాంబినేషన్‌లో క్లిక్ చేసి సెర్చ్ బాక్సులో హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నెంబరు కనిపించనివారు ఎంపికకానట్లే.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ISRO Recruitment: ఇస్రోలో 526 ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 526 అసిస్టెంట్, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్‌ పరిధిలో 54 పోస్టులు, శ్రీహరికోటలో 78 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget