ISRO Recruitment: ఇస్రోలో 526 ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్ పరిధిలో 54 పోస్టులు, శ్రీహరికోటలో 78 పోస్టులు ఉన్నాయి.
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 526 అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్ పరిధిలో 54 పోస్టులు, శ్రీహరికోటలో 78 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 9 లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు: 526
1) అసిస్టెంట్: 342 పోస్టులు
2) జూనియర్ పర్సనల్ అసిస్టెంట్: 154 పోస్టులు
3) అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 16 పోస్టులు
4) స్టెనోగ్రాఫర్: 14 పోస్టులు
ప్రాంతాల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-31, బెంగళూరు-215, హసన్-17, హైదరాబాద్-54, న్యూఢిల్లీ- 02, శ్రీహరికోట-78, తిరువనంతపురం-129.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 09.01.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీలకు 31 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఇతరులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/కంప్యూటర్ లిటరసీ టెస్ట్/స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష విధానం: రాతపరీక్షలో సింగిల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్/స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటాయి.ల
జీతభత్యాలు: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2022 నుంచి.
➥ దరఖాస్తు చివరి తేది: 09.01.2023
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.01.2023
రాతపరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, న్యూదిల్లీ, తిరువనంతపురం.
ALSO READ:
జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..