TSPSC JL Application: 1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 9న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. జూన్ లేదా జులైలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల్లో అత్యధికంగా మ్యాథ్స్-154, ఇంగ్లిష్-153, జువాలజీ-128, హిందీ-117; బోటనీ,కెమిస్ట్రీ-113 పోస్టులు, ఫిజిక్స్-112 పోస్టులు ఉన్నాయి.
కాగా.. జూనియర్ లెక్చరర్ల పోస్టుల్లో ఉర్దూ, మరాఠీ మీడియం పోస్టులకు పదోతరగతి వరకు ఆయా మీడియంలలో చదువుకున్నవారు లేదా పదోతరగతిలో ఆయా భాషలు ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉన్నా.. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో సెకండ్ లాంగ్వేజ్‌గా ఉన్న వారు ఈ మీడియంలోని పోస్టులకు అర్హులు. జేఎల్ సివిక్స్ పోస్టులకు పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ సబ్జెక్టుల్లో పీజీ చేసి 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులుగా నిర్ణయించారు.
వివరాలు..
➥ జూనియర్ లెక్చరర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1392
మల్టీ జోన్-1: 724 పోస్టులు
- ఆసిఫాబాద్-కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
- కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
- కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూలర్).
మల్టీ జోన్-2: 668 పోస్టులు
- సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి-యాదాద్రి, జనగామ
- మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
- మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు.
అర్హతలు ఇలా..
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, బీసీ-ఎస్సీ-ఎస్టీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
దరఖాస్తు/పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్షవిధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
Also Read:
పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..