News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

NALCO Recruitment: నాల్కోలో 189 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలివే!

ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్-2022 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు

FOLLOW US: 
Share:

భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో)లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్-2022 మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు విధిగా పనిచేస్తున్నట్లు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ

మొత్తం ఖాళీలు: 189

రిజర్వేషన్లు: జనరల్-79, ఈడబ్ల్యూఎస్-18, ఓబీసీ-51, ఎస్టీ-13, ఎస్సీ-28.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌-07, మెకానికల్‌-58, ఎలక్టికల్‌-41, మెటలర్జీ-14, ఇన్‌స్ట్రుమెంటేషన్-32, మైనింగ్-10, కెమికల్-14, కెమిస్ట్రీ-13.

అర్హత: 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉండాలి. ఇక కెమిస్ట్రీ విభాగంలో పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: 11.09.2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. 11.09.1992 సంవత్సరానికి ముందు జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500. సంస్థ ఉద్యోగులకు రూ.100.

ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు విధిగా అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ బాండ్ (రూ.3 లక్షలు/ రూ. 4 లక్షలు) కింద కనీసం 4 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఏడాది ట్రైనింగ్ పీరియడ్ అదనం.

జీతం: రూ.40,000

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.08.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితదీ: 11.09.2022.


నోటిఫికేషన్


వెబ్‌సైట్‌


Also Read:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌‌ విభాగాల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 4300 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 4019, మహిళలకు 281 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

 

Published at : 12 Aug 2022 08:32 PM (IST) Tags: NALCO Recruitment 2022 NALCO Jobs 2022 NALCO GET Recruitment 2022 National Aluminium Company Limited Jobs

ఇవి కూడా చూడండి

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

టాప్ స్టోరీస్

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?

Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
×