News
News
X

ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

FOLLOW US: 

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు...

పోస్టుల సంఖ్య: 108

1) కానిస్టేబుల్ (కార్పెంటర్): 56 పోస్టులు 

2) కానిస్టేబుల్ (మేసన్): 31 పోస్టులు 

3) కానిస్టేబుల్ (ప్లంబర్): 21 పోస్టులు 

Also Read:  6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా!  

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 17.09.2022 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

Also Readదేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

పేస్కేలు: నెలకు రూ.21,700 - రూ.69,100.

Also Read:  కోల్ఇండియాలో 481 పోస్టులు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.09.2022.

Notification

Online Application

Website

ITBP ప్రత్యేకతలివే...

భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఈ విభాగంలో దాదాపు 90,000 మందికి పైగా జవాన్లు, అధికారులు పని చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపు, శాంతిభద్రతల పరిరక్షణ విధులతోపాటు హిమాలయ సరిహద్దులను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశ రక్షణకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ ఈ దళంలో ఉంటారు. ప్రమాదకర, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. ఎక్కువగా హిమాలయాలలో 3,000 నుంచి 18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు రక్షణ విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీల వరకు పడిపోతుంది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఈ జవాన్లు శిక్షణ పొందారు. చైనా దురాక్రమణను తిప్పికొట్టడం నుంచి చమోలీలోని సొరంగం నుంచి ప్రజలను రక్షించడం వరకు ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసులు ఏదైనా చేయగలరు. 'శౌర్య-దృఢత-కర్మనిష్ఠ' (శౌర్యం- నిర్ణయం- విధులపై భక్తి) అనే నినాదానికి అనుగుణంగా ఈ జవాన్లు పని చేస్తారు. మానవుల గౌరవం, జాతీయ సమగ్రతను కాపాడటం వీరి ప్రధాన లక్ష్యం. దీనిని 'హిమాలయాల సెంటినెల్స్'గా వ్యవహరిస్తారు.

శిక్షణ ఇలా.. 

ITBP పుట్టుక గెరిల్లా యుద్ధ శిక్షణతో ముడిపడి ఉంది. దీని భావన, శిక్షణ, నైపుణ్యం చాలా భిన్నంగా ఉంటాయి. సైనిక, పోలీసు వ్యూహం శిక్షణతో పాటు, పర్వత యుద్ధం, రాక్, మంచు క్రాఫ్ట్, ముఖ్యంగా నిరాయుధ పోరాటంలో శిక్షణ ఇస్తుంది. అధిక-ఎత్తులో మనుగడ, రేంజర్లు, స్కీయింగ్, రాఫ్టింగ్ మొదలైనవి, ITBP కలిగి ఉన్న కొన్ని ప్రధాన నైపుణ్యాలు.

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 05 Aug 2022 09:52 AM (IST) Tags: ITBP Recruitment 2022 ITBP Constable Posts ITBP Constable Recruitment

సంబంధిత కథనాలు

Agnipath Scheme: తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ,  ముఖ్యమైన తేదీలివే!

Agnipath Scheme: తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, ముఖ్యమైన తేదీలివే!

BIS Admitcard: బీఐఎస్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్, పరీక్ష తేదీ ఇదే!

BIS Admitcard: బీఐఎస్ పరీక్ష అడ్మిట్ కార్డులు రిలీజ్, పరీక్ష తేదీ ఇదే!

BECIL Jobs: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.75 వేల జీతం!

BECIL Jobs: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.75 వేల జీతం!

TS Police: కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

TS Police: కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్,  ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

GAIL Recruitment: గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?

GAIL Recruitment:  గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?

టాప్ స్టోరీస్

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!