అన్వేషించండి

IBPS PO 2022: 6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా!

2023–24 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి 5 బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో 6 బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి మాత్రమే ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్ పీవో-2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Also Read:  కోల్ఇండియాలో 481 పోస్టులు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు

పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 6432 పోస్టులు

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

  1. కెనరా బ్యాంక్: 2500
  2. యూకో బ్యాంక్: 550

  3. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535

  4. పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500

  5. పంజాబ్ సింధ్ బ్యాంక్: 253

  6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

వాస్తవానికి మరో ఐదు ప్రభుత్వ బ్యాంకులు (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌) కూడా ఐబీపీఎస్‌ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2023–24 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో 6 బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి మాత్రమే ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

Also Read: ఇంజినీరింగ్‌తో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు- అమ్మాయిలూ అర్హులే!

వ‌యోపరిమితి: 01.08.2022 నాటికి 20 - 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1992 - 01.08.2002 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
రీజినింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం  100 100 60 నిమిషాలు

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం    : 02.08.2022

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది         : 22.08.2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌                        : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్                                                         : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌            : అక్టోబ‌ర్‌ 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష                                                            : అక్టోబ‌రు 2022.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు                                            : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌                               : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్                                                                : న‌వంబ‌రు 2022.

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు                                                : డిసెంబ‌రు 2022.

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌                                      : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023.

ఇంట‌ర్వ్యూ                                                                       : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

నియామకం                                                                      : ఏప్రిల్ 2023.

 

Notification

Online Application

Website

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Macherla Turaka Kishore Arrested: పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అంబులెన్స్ ఢీకొని శ్రీవారి భక్తులు మృతి
Macherla Turaka Kishore Arrested: పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
పినెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ అరెస్ట్, మాచర్లలో పలు దాడుల కేసుల్లో నిందితుడు
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Gavaskar Humiliated: ఇండియన్ అనే అవమానించారు.. బీజీటీ ప్రదానోత్సవానికి తనను పిలవకపోవడంపై గావస్కర్ అసంతృప్తి
ఇండియన్ అనే అవమానించారు.. బీజీటీ ప్రదానోత్సవానికి తనను పిలవకపోవడంపై గావస్కర్ అసంతృప్తి
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Keerthy Suresh : హనీమూన్​కోసం థాయిలాండ్ వెళ్లిన కీర్తి సురేశ్.. పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసిందిగా
హనీమూన్​కోసం థాయిలాండ్ వెళ్లిన కీర్తి సురేశ్.. పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో ఉన్న పర్సనల్ ఫోటోలు షేర్ చేసిందిగా
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Embed widget