DSSSB Recruitment 2022: దేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పరిధిలోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 547 టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీల్లో టీజీటీ, పీజీటీలతోపాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ)’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పరిధిలోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 547 టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీల్లో టీజీటీ, పీజీటీలతోపాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈడీ చదివిన వారికి ఇది చక్కటి అవకాశం.
ఖాళీల వివరాలు...
1) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ-స్పెషల్ ఎడ్యుకేషన్): 364 పోస్టులు
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ టీచర్ (పీజీటీ): 142 పోస్టులు
3) నాన్ టీచింగ్: 41 పోస్టులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, హిందీ.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా..
Also Read: 6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా!
అర్హత: టీజీటీ పోస్టులకు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమాతో కూడిన బీఈడీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి. పీజీటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ట్రైనింగ్/ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఏదైనా హైస్కూల్, కాలేజీలో మూడేళ్లు పనిచేసిన అనుభవం అవసరం. ఇతర ఖాళీలకు పోస్టును అనుసరించి అర్హతలు ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష విధానం:
- పీజీటీ పోస్టులకు 300 మార్కులకు 300 ప్రశ్నలు అడుగుతారు. అంటే ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. వీటిలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ విభాగాల నుంచి 20 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఇక సంబంధిత సబ్జెక్ట్-టీచింగ్ మెథడాలజీ విభాగం నుంచి 200 ప్రశ్నలు-200 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
- టీజీటీ పోస్టులకు మొత్తం 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వీటిలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ విభాగాల నుంచి 20 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఇక సంబంధిత సబ్జెక్ట్-టీచింగ్ మెథడాలజీ విభాగం నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
Also Read: కోల్ఇండియాలో 481 పోస్టులు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు
ప్రిపరేషన్ విధానం:
- ఈ పరీక్షకు సిలబస్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధిస్తూనే విద్యాసంబంధిత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చివరి ఆరునెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. రీజనింగ్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలకు సమప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రశ్నలు అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాలను లోతుగా పరీక్షించే విధంగా ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అభ్యర్థి నైపుణ్యాన్ని అంచనావేస్తారు. వీటన్నింటితోపాటు అభ్యర్థి తాను ఎంచుకున్న సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ఎంత కఠినమైన స్థాయిలో సన్నద్ధమైతే అంత మంచిది.
- జనరల్ అవేర్‌నెస్‌లో ఎక్కువగా వార్తల్లో వ్యక్తులు, ప్రాంతాలు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాలి. అలాగే జనరల్ స్టడీస్ కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జియోగ్రఫీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ఇక లాంగ్వేజ్ పేపర్లలో మంచి మార్కుల కోసం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. దీనివల్ల పదసంపద పెరగడమేకాక, భాషతో పరిచయం పెరుగుతుంది. పరీక్షలో సులువుగా సమాధానాలు రాసే వీలుంటుంది.
- చివరగా.. పరీక్షలో రీజనింగ్, అరిథ్ మెటిక్ సెక్షన్ల నుంచి ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు వీటితో ఇప్పటికే ఎంతోకొంత పరిచయం ఏర్పడి ఉంటుంది. మరింత సాధన చేయడం ద్వారా ఇందులో అధిక మార్కులు పొందవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి...
- అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ dsssbonline.nic.in లోకి లాగిన్ అవ్వాలి.
- అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి.
- క్రియేట్ ప్రొఫైల్‌లో అభ్యర్థులు అవసరమైన వివరాలు నమోదుచేయాలి.
- లాగిన్ అయి అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్టు ఎంపిక చేసుకోవాలి.
- దరఖాస్తు పూరించి, డాక్యుమెంట్స్, ఫీజు చెల్లించాలి.
- వివరాలు నమోదుచేసిన తర్వాత ‘Submit’ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత నింపిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28-07-2022.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27-08-2022.