SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 4300 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు..
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 4300 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 4019, మహిళలకు 281 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 4300
1) సబ్ ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) - సీఏపీఎఫ్: 3960 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-1583, ఈడబ్ల్యూఎస్-377, ఓబీసీ-1090, ఎస్సీ-611, ఎస్టీ-299.
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
2) సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మెన్/ఉమెన్) - ఢిల్లీ పోలీస్: 340 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్-154, ఈడబ్ల్యూఎస్-34, ఓబీసీ-81, ఎస్సీ-45, ఎస్టీ-26.
పేస్కేలు: రూ.35,400 - రూ.1,12,400.
Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
అర్హత: ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి:
01.01.2022 నాటికి 20-25 సంత్సరాల మధ్య ఉండాలి. 02.01.1997 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. వితంతు, ఒంటరి మహిళలు జనలర్ కేటగిరీ వారికి 35 సంవత్సరాల వరకు, ఎస్సీ-ఎస్టీ కేటగిరీ వారికి 40 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంది. ఇక డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులైతే జనరల్-30 సంవత్సరాలు, ఓబీసీ-33 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-35 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ లేదా SBI చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. బ్యాంకు చలనా ద్వారా ఫీజు చెల్లించాలనుకునేవారు ఆగస్టు 30లోగా చలానా జనరేట్ చేసి, ఆగస్టు 31 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రెండు దశల రాతపరీక్షలు, పీఈటీ/పీఎస్‌టీ, మెడికల్ టెస్ట్ ద్వారా. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనికి ఎలాంటి మార్కులు ఉండవు.
Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు
రాత పరీక్ష విధానం..
✦ రెండు దశల్లో రాతపరీక్షలు నిర్వహిస్తారు.
✦ మొదటి దశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
✦ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 50 ప్రశ్నలచొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
✦ పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.
✦ ఇక రెండో దశ పరీక్ష డిస్క్రిప్టివ్ (పెన్, పేపర్) విధానంలో ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన
200 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
✦ హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
శారీరక ప్రమాణాలు: పురుషుల కనీస ఎత్తు 170 సెం.మీ. చాతీ 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి. మహిళల కనీస ఎత్తు 154 సెం.మీ. ఉండాలి.
Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2022
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.08.2022 (23 : 00)
✦ ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేదీ: 30.08.2022 (23 : 00)
✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 31.08.2022 (23 : 00)
✦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 31.08.2022
✦ దరఖాస్తుల సవరణ, ఫీజు చెల్లింపు: 01.09.2022 (2300)
✦ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబరు, 2022.