News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS Jobs: తెలంగాణలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అర్హతలివే!

తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1520 పోస్టులను భర్తీ చేయనున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1520

* మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఫిమేల్)  పోస్టులు

అర్హత: మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు మరియు మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణను పూర్తి చేసి ఉండాలి. (లేదా) గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణను పూర్తి చేసుకొని ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ప్రాసెసింగ్ ఫీజు-రూ.200; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: పరీక్ష ఓఎంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష ఆంగ్లంలో జరుగుతుంది.

పరీక్షా కేంద్రాలు:  హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

పే స్కేల్: రూ.31,040 – 92,050 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25.08.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.09.2023.

Notification 

Website

ALSO READ:

ఎయిమ్స్‌ రాయ్‌బరేలీలో 111 టెక్నీషియన్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు, అర్హతలివే!
రాయ్‌బరేలీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌‌లో 55 గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌‌ గ్రాడ్యుయేట్‌& టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 55 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 27 Jul 2023 08:00 AM (IST) Tags: MHSRB Recruitment Medical Health Services Recruitment Board Multipurpose Health Assistant Posts MHSRB Notification

ఇవి కూడా చూడండి

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే