అన్వేషించండి

SSC CPO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!

ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది.

ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు..

* ఎస్‌ఐ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 1876 (పురుషులు-1710, మహిళలు-166).

పోస్టులవారీగా ఖాళీలు..

➥ ఢిల్లీ పోలీసు:​ 106 పోస్టులు

➥ బీఎస్​ఎఫ్​: 113 పోస్టులు

➥ సీఐఎస్​ఎఫ్:​ 630 పోస్టులు

➥ సీఆర్​పీఎఫ్​: 818 పోస్టులు

➥ ఐటీబీపీ: 63 పోస్టులు

➥ ఎస్​ఎస్​బీ: 90 పోస్టులు 

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఢిల్లీ పోలీసు డిపార్ట్​మెంట్​లో సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్​ సైకిల్​ కారుకు సంబంధించిన డ్రైవింగ్​ లైసెన్స్​ను కలిగి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు ఎక్స్-​సర్వీస్​మెన్​ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్,​ ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్​మెన్​, మహిళలకు దరఖాస్తు​ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మొత్తం నాలుగు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో మొదటి దశలో పేపర్-1 (కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్), రెండో దశలో ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఎస్టీ/పీఈటీ), పేపర్-2 (డీఎంఈ), మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

పేపర్-1 పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్-50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 025 మార్కులు కోత విధిస్తారు.

పేపర్-2 పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 025 మార్కులు కోత విధిస్తారు.

ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థుల శారీరక ప్రమాణాలు (ఎత్తు, ఛాతీ), లాంగ్ జంప్, హైజంప్, షార్ట్​పుట్ నిర్వహిస్తారు. 

డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) చివరగా పూర్తిస్థాయిలో అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్​ విడుదల: 21.07.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.08.2023.

ఫీజు చెల్లించడానికి చివరితేదీ:  17.08.2023.

దరఖాస్తుల సవరణ: 16.08.2023, 17.08.2023.

పేపర్​-1 పరీక్షలు:  03.10.2023 -  06.10.2023. 

Notification

Online Application

                     

ALSO READ:

ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
Borabanda Politics: బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
Dies Irae Collection : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
Embed widget