Medical Officer Posts: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 44 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు.
వివరాలు..
మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 156 (జోన్-1: 96, జోన్-2: 60)
విభాగాలవారీగా ఖాళీలు: ఆయుర్వేద-54, హోమియో-33, యునాని-69.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, నిరుద్యోగ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 80 మార్కులు విద్యార్హతకు, 20 మార్కులు అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం: రూ.54,220 - రూ.1,33,630.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.08.2023. (10.30 am)
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.08.2023. (5.00 pm)
ALSO READ:
ఎన్ఐఓహెచ్ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్ బాలాఘట్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial