By: ABP Desam | Updated at : 24 Mar 2023 09:30 PM (IST)
Edited By: omeprakash
ఐసర్‌లో నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 21
పోస్టుల వారీగా ఖాళీలు..
1. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్: 01
2. జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01
3. ల్యాబ్ అసిస్టెంట్: 09
4. జూనియర్ అసిస్టెంట్: 09
5. అటెండర్(కుక్): 01
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30-38 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25000-రూ.62000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 12.04.2023.
Also Read:
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 23, 24 తేదీల్లో ఐబీల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-1 రాతపరీక్ష నిర్వహించనడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ ఫైనల్ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల - రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం!
TSLPRB Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల, 84.06 శాతం మంది అర్హత!
TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్
LIC ADO Result 2023: ఎల్ఐసీ ఏడీవో మెయిన్స్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
UPSC Civils Exam: వెబ్‌సైట్‌లో యూపీఎస్సీ సివిల్స్-2023 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం!
AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం
Hyderabad Fire Accident: ఎల్బీ నగర్లో తీవ్ర అగ్ని ప్రమాదం, తగలబడ్డ 50 కార్లు! పక్కనే మల్టిప్లెక్స్
BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?
Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం