IFSCA: ఐఎఫ్‌ఎస్‌సీఏలో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
గాంధీనగర్‌లోని ఇంటర్‌నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్‌సీఏ) వివిధ ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గాంధీనగర్‌లోని ఇంటర్‌నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్‌సీఏ) వివిధ ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ/ సీఎఫ్ఏ/ సీఎస్/ ఐసీడబ్ల్యూఏ/డిగ్రీ(లా)/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 03 వరకు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 20
* ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులు.
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 10, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ-01, ఈడబ్ల్యూఎస్- 01.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్)/ సీఏ/ సీఎఫ్ఏ/ సీఎస్/ ఐసీడబ్ల్యూఏ/డిగ్రీ(లా)/ మాస్టర్స్ డిగ్రీ(స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్)/ ఎకనోమెట్రిక్స్) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.02.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. రెండు పేపర్లు. ప్రతి పేపర్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపర్‌లో సమాధానాలు గుర్తించడానికి 60 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.44500-రూ.89150 చెల్లిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/ రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభ తేదీ: 11.02.2023.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 03.03.2023.
🔰 ఫేజ్I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2023
🔰 ఫేజ్ II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2023
🔰 ఫేజ్ III ఇంటర్వ్యూ తేదీలు: త్వరలో తెలియజేయబడతాయి.
Notification
Registration link
Website
Also Read:
TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు, షెడ్యూలు ఇలా!
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వీటిలో పశుసంవర్థక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 15, 16 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో వీరికి రాత పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 193 పారామెడికల్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులు - అర్హతలివే!
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తారాపూర్ మహారాష్ట్ర సైట్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 193 పారామెడికల్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది ఫిబ్రవరి 28గా నిర్ణయించారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఎల్ ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ నెలరోజులు ఆలస్యం!
తెలంగాణ కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే పరిపాలనా సంబంధ కారణాల వల్ల దరఖాస్తు తేదీల్లో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మార్చి 20 నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభిస్తున్నట్లు గతంలో టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..