TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు, షెడ్యూలు ఇలా!
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వివరాలు ఇలా..
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వీటిలో పశుసంవర్థక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 15, 16 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో వీరికి రాత పరీక్ష నిర్వహించనున్నారు.
అలాగే భూగర్భజల శాఖలో వివిధ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే నాన్-గెజిటెడ్ పోస్టులకు మే 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
నేటితో ముగియనున్న 'గ్రూప్-2' దరఖాస్తు గడువు..
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జనవరి 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఈ ఒక్కరోజే చివరి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
గ్రూప్-2 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్సీకి 'పరీక్షా' సమయం, నియామక పరీక్షల తేదీలపై తర్జనభర్జన..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పరీక్షల తేదీల రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలకు సంబంధించి తర్జనభర్జన పడుతోంది. టీఎస్‌పీఎస్సీకే పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలు బిజీగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..