News
News
X

Teacher Jobs: ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?

ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

FOLLOW US: 
Share:

కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు...

ఖాళీల సంఖ్య: 1428

1. యోగాటీచర్లు: 119 పోస్టులు 

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. యోగా సైన్స్‌లో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.32,000.

2. ఆర్ట్స్ టీచర్లు: 119 పోస్టులు 

అర్హత: హయ్యర్ సెకండరీ/ఇంటర్ అర్హత ఉండాలి. ఫుల్‌టైమ్ డిప్లొమా (ఫైన్‌ఆర్ట్స్/పెయింటింగ్/డ్రాఫ్టింగ్ & పెయింటింగ్).

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.32,000.

3. మ్యూజిక్ టీచర్లు: 119 పోస్టులు 

అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా ఇంటర్ అర్హత ఉండాలి. దీనితోపాటు బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ (మ్యూజిక్) అర్హత ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.32,000.

4. హిందీ టీచర్లు: 119 పోస్టులు 

అర్హత: హిందీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ హిందీ పండిట్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

5. తెలుగు టీచర్లు: 119 పోస్టులు  

అర్హత: తెలుగు ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ తెలుగు పండిట్ కోర్సు లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

6. ఇంగ్లిష్ టీచర్లు: 119 పోస్టులు  

అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

7. మ్యాథ్స్ టీచర్లు: 119 పోస్టులు

అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ. బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

8. జనరల్ సైన్స్ టీచర్లు: 119 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్-బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ). బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

9. సోషల్ స్టడీస్ టీచర్లు: 119 పోస్టులు 

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (హిస్టరీ/జియోగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్). బీఈడీ కోర్సు లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. టెట్- పేపర్-2 అర్హత ఉండాలి.

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

10. లైబ్రేరియన్: 119 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.35,000.

11. టెక్నికల్ అసిస్టెంట్: 119 పోస్టులు 

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఐటీ)/బీసీఏ డిగ్రీ ఉండాలి. లేదా డిప్లొమా (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్).

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.30,000.

12. ఆఫీస్ సబార్టినేట్: 119 పోస్టులు

అర్హత: పదోతరగతి అర్హత ఉండాలి. 

వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

జీతం: రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపి విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ముఖ్యమైన తేదీలు..

➥ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07-02-2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25-02-2023.

➥ మెరిట్ జాబితా: 30-03-2023.

➥ అపాయింట్‌మెంట్ లెటర్: 15-04-2023.

➥ సంబంధిత పాఠశాలలో రిపోర్టింగ్: 02-05-2023.

Online Application

Website

Also Read:

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!

సీడాక్‌లో 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

టాటా స్టీల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 13 Feb 2023 10:51 AM (IST) Tags: Teacher Posts aided minority schools maharshi vedvyas outsourcing teachers recruitment takniki shiksha vidhan council AP Teacher Posts

సంబంధిత కథనాలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?