BOI PO Recruitment: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11 నుంచి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11 నుంచి 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
➥ జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ (జీబీవో): 350
➥ ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెషలిస్ట్ స్ట్రీమ్(ఎస్‌పీఎల్): 150
అర్హత: క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐటీ ఆఫీసర్ ఖాళీలకు బీఈ, బీటెక్/ పీజీ(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.02.2023 నాటికి 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
రాత పరీక్ష విధానం: ఇంగ్లిష్ లాంగ్వేజ్(35 ప్రశ్నలు, 40 మార్క్లులు), రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్(45 ప్రశ్నలు, 60 మార్క్లులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు, 40 మార్క్లులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్(35 ప్రశ్నలు, 60 మార్క్లులు), ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పేపర్- లెటర్ రైటింగ్ ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.36,000 - రూ.63,840.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
➛ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11.02.2023.
➛ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.02.2023.
Also Read:
C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..