News
News
X

నేటితో ముగియనున్న 'గ్రూప్-2' దరఖాస్తు గడువు, ఇంకా అప్లయ్ చేయలేదా? చేసేయండి!

గ్రూప్-2 పోస్టుల భర్తీకి  జనవరి 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలి.

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి  జనవరి 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఈ ఒక్కరోజే చివరి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత కూడా ఉండాలి. సరైన అర్హతలున్నవారు  ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. గ్రూప్-2 పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.320 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.120 పరీక్ష ఫీజు కింద చెల్లించాలి. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

గ్రూప్-2 టిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

TSPSC Group2 Online Application..

పోస్టుల వివరాలు...

* గ్రూప్-2 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..

Also Read:

తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 16 Feb 2023 10:53 AM (IST) Tags: TSPSC Recruitment TSPSC Group 2 Notification TSPSC Group 2 Recruitment TSPSC Group 2 Application Group 2 Application Last date

సంబంధిత కథనాలు

CRPF Admit Cards: సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CRPF Admit Cards: సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?