TSPSC DL Recruitment: డీఎల్ ఉద్యోగార్థులకు అలర్ట్, దరఖాస్తు ప్రక్రియ నెలరోజులు ఆలస్యం!
పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మార్చి 20 నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
తెలంగాణ కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే పరిపాలనా సంబంధ కారణాల వల్ల దరఖాస్తు తేదీల్లో టీఎస్‌పీఎస్సీ మార్పులు చేసింది.
ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మార్చి 20 నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభిస్తున్నట్లు గతంలో టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మళ్లీ ఇప్పుడు మార్చి 20 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది..
పోస్టుల వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 544
1) అసిస్టెంట్ ప్రొఫెసర్స్: 491
సబ్జెక్టులవారీగా ఖాళీలు..
➥ ఇంగ్లిష్ - 23
➥ తెలుగు - 27
➥ ఉర్దూ - 02
➥ సంస్కృతం - 05
➥ స్టాటిస్టిటిక్స్ - 23
➥ మైక్రోబయాలజీ - 05
➥ బయోటెక్నాలజీ - 09
➥ అప్లయిడ్ న్యూట్రీషన్ - 05
➥ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ - 311
➥ కామర్స్-బిజినెస్ అనలిటిక్స్ (స్పెషలైజేషన్) - 08
➥ డెయిరీ సైన్స్ - 08
➥ క్రాప్ ప్రొడక్షన్ - 04
➥ డేటాసైన్స్ - 12
➥ ఫిషరీస్ - 03
➥ కామర్స్ (ఫారీన్ ట్రేడ్-స్పెషలైజేషన్) - 01
➥ కామర్స్(టాక్సేషన్-స్పెషలైజేషన్) - 06
2) ఫిజికల్ డైరెక్టర్: 29
3) లైబ్రేరియన్: 24
ముఖ్యమైన తేదీలు..
↪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2023.
↪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.02.2023.
వివిధ పరీక్షల తేదీలు ఖరారు, షెడ్యూలు ఇలా..
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వీటిలో పశుసంవర్థక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 15, 16 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో వీరికి రాత పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే భూగర్భజల శాఖలో వివిధ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే నాన్-గెజిటెడ్ పోస్టులకు మే 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.
టీఎస్‌పీఎస్సీకి 'పరీక్షా' సమయం, నియామక పరీక్షల తేదీలపై తర్జనభర్జన..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పరీక్షల తేదీల రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలకు సంబంధించి తర్జనభర్జన పడుతోంది. టీఎస్‌పీఎస్సీకే పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలు బిజీగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..