HPCL Recruitment 2022: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 14.. అప్లై చేయండిలా..
విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది.
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్)లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెుత్తం 100 అప్రెంటీస్ పోస్టుల ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో ప్రకటించారు. అన్నీ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు. ఎంపికైన వారికి.. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో పోస్టింగ్ ఉంటుంది. 2022 జనవరి 14 వరకు పోస్టులకు అప్లై చేసుకునేందుకు చివరితేదీగా ఉంది. ఈ అప్రెంటీస్ పోస్టులు సంవత్సరం వరకూ ఉంటాయి.
ఖాళీల వివరాలు..
మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కేటరింగ్ టెక్నాలజీ, సివిల్ ఎన్విరాన్‌మెంటల్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్), ఎనర్జీ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఫైన్ ఆర్ట్ లేదా స్కల్ప్‌చర్ లేదా కమర్షియల్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డెకరేషన్, పెట్రోలియం ఇంజనీరింగ్, రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్, టెలీకమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్, టెలివిజన్ ఇంజనీరింగ్, వాటర్ మేనేజ్‌మెంట్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్ చేసి ఉండాలి.
జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్యమైన విషయాలు..
దరఖాస్తు ప్రారంభం - 2022 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ - 2022 జనవరి 14
ఇంటర్వ్యూ తేదీ- 2022 జనవరి
విద్యార్హతలు- సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2022 జనవరి 7వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్లులోపు ఉండాలి.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
స్టైపెండ్- రూ.25,000
ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి
Also Read: Hyderabad Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Also Read: MIDHANI Recruitment 2022: హైదరాబాద్ మిధానిలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనం.. అప్లై చేసుకోండిలా..