By: ABP Desam | Updated at : 03 Jan 2022 03:41 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు మిధాని కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) నుంచి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటిచింది. మెుత్తం 61 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
మిధానిలో ఉద్యోగాల కోసం.. దరఖాస్తు ప్రక్రియ జనవరి 1 నుంచి ప్రారంభమైంది. జనవరి 15న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ 53, అసిస్టెంట్ మేనేజర్ 06, మేనేజర్ 2 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Vacancy Details for MIDHANI Recruitment 2022 Job Notification:
Management Trainee -Metallurgy : 22
Management Trainee Mechanical: 15
Management Trainee -Electrical: 06
Management Trainee Ceramic Engg.: 01
Management Trainee -Chemical Engg.:01
Management Trainee -Administration / HR : 04
Management Trainee - Civil: 03
Management Trainee - Safety:01
Assistant Manager -Materials Management: 03
Assistant Manager -Corporate Communication:01
Assistant Manager -Medical : 01
Assistant Manager - IT:01
Manager - Automation :01
Manager - Mechanical :01
మేనేజ్మెంట్ ట్రైనీ కోసం మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్/హెచ్ఆర్, సివిల్, సేఫ్టీ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ కోసం అప్లై చేసుకునేవారు.. మెటీరియల్స్ మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్, మెడికల్, ఐటీ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయసు.. 30 ఏళ్ల లోపు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా.. ఏడాదికి రూ. 9 లక్షల నుంచి రూ. 31.60 లక్షల వేతనం చెల్లించే అవకాశం ఉంది.
మేనేజర్ పోస్టు కోసం అప్లే చేసుకునేవారు.. ఆటోమేషన్, మెకానికల్ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.13.50 లక్షల నుంచి రూ.40.70 లక్షల వేతనం వచ్చే అవకాశం ఉంది.
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్.. www.midhani-india.in లోకి వెళ్లాలి. అనంతరం కెరీర్ ఆప్షన్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుంటే భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడొచ్చు.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also Read: BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలో తెలుసా?
Also Read: APPSC Jobs Recruitment: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. ఉద్యోగాల వివరాలివే.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Telangana Police Jobs: పోలీసు ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? ఇవాళే లాస్ట్ డేట్!
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్