HCL: హెచ్‌సీఎల్‌లో 24 మేనేజ్‌మెంట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.
కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 24.
పోస్టులు: డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీలు.
విభాగాలు: జియోలజీ, సర్వే, ఆర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ఆర్, లా, ఎలక్ట్రికల్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28-47 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: సీనియర్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ/ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు రెండు దశలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 1) కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, 2) పర్సనల్ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ/ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు సీబీటీకి 70 శాతం, ఇంటర్వ్యూకి 30శాతం వెయిటేజ్ ఉంటుంది సీనియర్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సీబీటీకి 80 శాతం, ఇంటర్వ్యూకి 20శాతం వెయిటేజ్ ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 28.02.2023.
Also Read:
TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది.
గ్రూప్-1 మెయన్స్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 20న అధికారులు విడుదల చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు సాంకేతిక కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..