News
News
X

Head Constable Hall Tickets: సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!

రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 20న అధికారులు విడుదల చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 15న విడుదల కావాల్సిన అడ్మిట్ కార్డులు సాంకేతిక కారణాల వల్ల 5 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టుల రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి జనవరి 4 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 - రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500-రూ.81,100  జీతంగా ఇస్తారు.

అడ్మిట్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...

స్టెప్-1: సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://crpf.gov.in

స్టెప్-2: అక్కడ హోంపేజీలో కనిపించే "Recruitment" ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.

స్టెప్-3: అక్కడ"ASI/Head Constable Admit Card" లింక్ మీద క్లిక్ చేయాలి. 

స్టెప్-4: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి. 

స్టెప్-5: "Submit" బటన్ మీద క్లిక్ చేయలి.

స్టెప్-6: అభ్యర్థికి సంబంధించిన 'CRPF admit card' స్క్రీన్ మీద కనిపిస్తుంది.

స్టెప్-7: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/81118/login.html

Download CRPF Head Constable Admit Card 2023

పరీక్ష విధానం..
కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో హిందీ/ఇంగ్లిష్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్-25 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి.  పరీక్ష సమయం 90 నిమిషాలు. 

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును పరీక్ష రోజు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డులేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు. పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ ‌‌కార్డులో సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు, క్యాలిక్యేలేటర్లు, డిజిటల్ వాచీలు, బ్లూటూట్ డివైస్‌లు, ఇతర వస్తువులేవీ తీసుకెళ్లాడానికి వీల్లేదు. అమ్మాయిలైతే బంగారు ఆభరణాలు, చేతులకు మెహందీ, టాటూలు ధరించడానికి వీల్లేదు. 

తెలుగు రాష్ట్రాల్లో సీబీటీ పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.01.2023.

➥ సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 15.02.2023.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 22-28 మధ్య.

Notification 

Website

Also Read:

అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 152 పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), ఒప్పంద/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్, హై పెర్ఫార్మెన్స్ కోచ్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా  లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 3లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 20 Feb 2023 11:00 PM (IST) Tags: CENTRAL RESERVE POLICE FORCE CRPF Admit Card today CRPF Admit Card releases today CRPF Admit Card 2023 released today CRPF Admit Card 2023

సంబంధిత కథనాలు

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS PO results: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS PO results: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?

TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్