అన్వేషించండి

DRDO Recruitment: డీఆర్‌డీవోలో 1901 ఖాళీలు, అర్హతలివే!

సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

DRDO Jobs: భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

 

Also Read: AP DSC Jobs: ఏపీ ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్‌ పోస్టులు



వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1901

 

పోస్టుల వారీగా ఖాళీలు:

 

1) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B): 1075

 

2)టెక్నీషియన్-A (టెక్-A): 826

 

పోస్టుల కేటాయింపు: జనరల్-863 (474+389), ఓబీసీ-452 (259+193), ఈడబ్ల్యూఎస్-211 (132+79), ఎస్సీ-248 (149+99), ఎస్టీ-127 (61+66).

 

Also Read: AP DSC Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు


అర్హత: 23.09.2022 నాటికి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ(సైన్స్) లేదా డిప్లొమా (ఇంజినీరింగ్/టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/అనుబంధ సబ్జెక్టులు) అర్హత ఉండాలి. అలాగే టెక్నీషియన్-ఎ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్/నేషనల్ అప్రెంటిష్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి.

 

వ‌యోపరిమితి: 23.09.2022 నాటికి 18 - 28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 

ఎంపిక‌ విధానం: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపికచేస్తారు. టెక్నీషియన్-A పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

 

Also Read: AP IEDSS: ఏపీ ఐఈడీఎస్‌ఎస్‌ ప్రత్యేక విద్యలో 81 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు



దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. . ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.

 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 03.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.09.2022.

టైర్-I పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ (CBT): ప్రకటించాల్సి ఉంది.

 

Notification


Website 

 

Also Read:

SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫ‌ర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2022 ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget