AP DSC Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP DSC Notification: ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 17 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 207
1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): 176 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్.
Also Read: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 103 ఖాళీలు, ఎవరు అర్హులంటే?
2) ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 31 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.
3) ఆర్ట్ ఉపాధ్యాయులు
జోన్ల వారీగా ఖాళీలు: జోన్-1: 62 పోస్టులు, జోన్-2: 04 పోస్టులు, జోన్-3: 48 పోస్టులు, జోన్-4: 93 పోస్టులు
Also Read: నాల్కోలో 189 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు, అర్హతలివే!
అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్యమైన తేదీలు:
♦ ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.
♦ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.
♦ హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.
♦ ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.
♦ పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.
♦ ఫలితాల ప్రకటన: 04.11.2022.
Also Read:
SSC - జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ 2022
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..