అన్వేషించండి

SSC JE 2022: జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ వచ్చేసింది, అర్హతలు ఇవే!

SSC JE నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు.

కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 12న నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని 22 విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఆగస్టు 3 వరకు గడువు ఉంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు.


❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2022

విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్.

విభాగాలవారీగా పోస్టులు:

విభాగం  పోస్టులు
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్)
సెంట్రల్ వాటర్ & పవర్ రిసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్)
ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్) జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)
డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ ఎస్యురెన్స్ (నేవల్) జూనియర్ ఇంజినీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్)


అర్హత‌: 02.09.2022 నాటికి సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు 2-3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే కొన్ని విభాగాల్లోని పోస్టులకు మాత్రమే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. 

Also Read: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 103 ఖాళీలు, ఎవరు అర్హులంటే?

వ‌యోప‌రిమితి: విభాగాల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో తేడాలు ఉంటాయి. 01.01.2022 నాటికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని విభాగాలకు 32 సంవత్సరాలు, మ‌రికొన్నింటికి 30 సంవత్సరాల వరకు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు(జనరల్) 10 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. డిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు ఎస్సీ-ఎస్టీలకు 8 సంవత్సరాలు, ఇతరులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: నాల్కోలో 189 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలివే!


ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్.

పరీక్ష విధానం:
✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.

✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ & రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.

ముఖ్యమైన తేదీలు..

✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2022.

✦ దరఖాస్తుకు చివరితేది: 02.09.2022. 

✦ చలానా జనరేషన్‌కు చివరితేది: 02.09.2022.

✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 03.09.2022.

✦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 03.09.2022

.✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.09.2022

✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేది: నవంబరు, 2022.

✦ పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేది: ప్రకటించాల్సి ఉంది.


నోటిఫికేషన్


ఆన్‌లైన్ అప్లికేషన్

 

Also Read:

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!

టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget