AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 88 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, వివరాలు ఇలా!
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మెయిల్ ద్వారా జనవరి 14, స్పీడ్ పోస్టు ద్వార 19వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 88
⋆ సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులు.
1. అనస్థీషియాలజీ: 04
2. అనాటమీ: 03
3. బయోకెమిస్ట్రీ: 01
4. బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ: 04
5. సీటీవీఎస్: 01
6. కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్: 03
7. డెర్మటాలజీ: 05
8. ఎండోక్రినాలజీ: 06
9. ఈఎన్‌టీ: 01
10. ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ: 01
11. జనరల్ మెడిసిన్: 10
12. జనరల్ సర్జరీ: 03
13. మెడికల్ ఆంకాలజీ / హెమటాలజీ(మెడికల్ ఆంకాలజీకి మాత్రమే): 02
14. మైక్రోబయాలజీ: 03
15. అబ్స్ట్. & గైనకాలజీ: 02
16. ఆప్తామాలజీ: 06
17. ఆర్థోపెడిక్స్: 02
18. పీడియాట్రిక్ సర్జరీ: 02
19. పీడియాట్రిక్స్: 02
20. పాథాలజీ: 02
21. ఫార్మకాలజీ: 01
22. ఫిజియాలజీ: 03
23. పీఎమ్‌ఆర్: 01
24. సైకియాట్రీ: 03
25. రేడియో డయాగ్నిసిస్: 04
26. రేడియోథెరపీ: 03
27. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ: 05
28. సర్జికల్ ఆంకాలజీ: 02
29. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్: 01
30. యూరాలజీ: 02
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
జీతభత్యాలు: నెలకు రూ.67700 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: 3 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యఎస్ అభ్యర్థులకు రూ. 1200. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: మెరిట్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఈమెయిల్: academic@aiimsbhubnaeswar.edu.in
చిరునామా:
REGISTRAR
ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES (AIIMS), BHUBANESWAR
ADMINISTRATIVE BLOCK, 1ST FLOOR
SIJUA, POST: DUMUDUMA, BHUBANESWAR (ODISHA) – 751019.
ముఖ్యమైన తేదీలు..
🔰 మెయిల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది: 14.01.2023.
🔰 స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తుకు చివరి తేది: 19.01.2023.
Also Read:
సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వరంగల్ 'నిట్'లో 100 టీచింగ్ ఫ్యాకల్టీలు, పోస్టుల వివరాలు ఇలా! అర్హతలివే!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 27న ప్రారంభంకాగా.. జనవరి 25 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...