Shanmukh Jaswanth Bail: షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్ - నిజంగానే అతడి ఇంట్లో గంజాయి ఉందా? ఏసీపీ ఏం చెప్పారు?
Shanmukh Jaswanth Bail: గంజాయి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి వచ్చారు. బయటికి వచ్చిన ఫొటోను లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Shanmukh Jaswanth Bail - Kalyan Dileep Sunkara Post: గంజాయి, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ తో షణ్ముఖ్ అన్న సంపత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించడంతో అతని అన్నతో పాటు, షణ్ముఖ్ ని కూడా అరెస్టు చేశారు పోలీసులు. కాగా.. షణ్ముఖ్ జశ్వంత్ బెయిల్ పై బయటికి వచ్చాడు. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. సంపత్ కనిపించలేదు. దీంతో అతనికి బెయిల్ వచ్చిందా లేదా అనేది క్లారిటీ రాలేదు. మరోవైపు షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
గంజాయి దొరికింది ఏసీపీ..
షణ్ముఖ్ జశ్వంత్ కేసులో అసలు ఏం జరిగింది? ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే విషయాలపై నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. గంజాయి దొరకడం నిజమే అని ఆయన అన్నారు. "తనని మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వాడుకుని వదిలేశాడని షణ్ముఖ్ అన్న మీద వైజాగ్ కి చెందిన ఒక అమ్మాయి కేసు పెట్టింది. హైదరాబాద్ లోని ప్రజ్టీస్ హోమ్స్ లో వాళ్లు ఉంటారని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా.. షణ్ముక్ కూడా ఉన్నాడు. ఇంట్లో గంజాయి దొరికింది. దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్నాం" అని అన్నారు ఏసీపీ.
మోతాదు ఎంతైనా నేరమే..
"గంజాయి దొరికిన మోతాదు చాలా తక్కువే. కానీ, గంజాయి ఎంత చిన్న మొత్తంలో దొరికినా నేరం నేరమే. కానీ, సెక్షన్లు వేరుగా ఉంటాయి. దాంట్లో భాగంగానే కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ జరుగుతుంది. ఎలాంటి శిక్ష పడుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ మీద మాత్రం అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆయనపై చర్యలు కచ్చితంగా ఉంటాయి. అమ్మాయి వైజాగ్ అయినప్పటికీ అబ్బాయి కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కేసు పెట్టింది. అన్నీ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత.. కేసు మా పరిధిలోకి రాదు అని తేలితే దాన్ని వైజాగ్ కి మారుస్తాం’’ అని క్లారిటీ ఇచ్చారు ఏసీపీ.
పోస్ట్ వైరల్..
ఇక కల్యాణ్ దిలీప్ సుంకర పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది మాత్రం షణ్ముఖ్ బయటికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలోనూ వివాదం..
యూట్యూబ్ వేదికగా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జశ్వంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించాడు. అయితే, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు షణ్ముఖ్. గతంలో మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అతివేగంగా కారును నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కడం షణ్ముఖ్ కు కామన్ అయ్యింది.
Also Read: చెన్నైలో ఉండి బతికిపోయాడు - సంగీత దర్శకుడిపై 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టర్ ఫైర్