అన్వేషించండి

Tholi Prema Movie: పవర్ స్టార్ ‘తొలి ప్రేమ’ చూసి కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరిన అమితాబ్, బిగ్‌బీ ఎందుకంత ఇరిటేట్ అయ్యారు?

బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా చూసి కోపం ఊగిపోయారట. ఏకంగా తన చేతిలోని కారు కీస్ టీవీ స్క్రీన్‌పై విసిరారట. ఆ సీన్ చూసి జయా బచ్చన్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారట.

వర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రొమాంటిక్ మూవీ ‘తొలిప్రేమ’. అతడి సినీ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు అయ్యింది. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్ కీలక విషయాలు చెప్పారు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చూసి ఎలా ఫీలయ్యారో వివరించారు.  

‘తొలిప్రేమ’ చూస్తూ కోపంతో ఊగిపోయిన బిగ్ బీ

‘తొలిప్రేమ’ సినిమా విడుదలై తెలుగులో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను తన ఇంట్లో చూశారట. తన భార్య జయా బచ్చన్ తో కలిసి ఈ సినిమాను చూశారట. మూవీ క్లైమాక్స్ చూసి ఆయనకు విపరీతమైన టెన్షన్ తో పాటు చిరాకు పడ్డారని చెప్పారు దర్శకుడు కరుణాకరన్. “ ‘తొలిప్రేమ’ క్లైమాక్స్ ప్రేక్షకులలో విపరీతమైన టెన్షన్‌ను కలిగిస్తుంది. ఎందుకంటే, హీరో చివరి వరకు తన ప్రేమను చెప్పడు. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు, హీరో ఎంతకీ హీరోయిన్‌కు తన లవ్ గురించి చెప్పకపోవడం పట్ల అమితాబ్ కూడా బాగా విసుగు చెందారు. చివరకు ఆ టెన్షన్ తట్టుకోలేకపోయారు. ఆయనకు విసుగుతో పాటు కోపం కూడా వచ్చింది. వెంటనే తన  కారు కీస్  టీవీ స్క్రీన్‌పై విసిరారు” అని చెప్పుకొచ్చారు. ఇక ఆయనతో కలిసి సినిమా చూస్తున్న జయా బచ్చన్ మాత్రం హీరోయిన్ తిరిగి వచ్చినప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేశారని వివరించారు. అంతేకాదు, ఎండింగ్ సీన్ చూసి చప్పట్లు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్,  దర్శకుడు కరుణాకరణ్ కు చెప్పారట. తాజాగా ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.

‘తొలిప్రేమ’ చిత్రం గురించి..

పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. కరుణాకర్ దర్శకత్వం వహించగా, దేవా సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యాక, తమిళంలో ‘ఆనందమజై’ అనే పేరుతో డబ్ చేయబడింది. కన్నడలో ‘ప్రీత్సు తప్పెనిల్లా’ (2000),  హిందీలో ‘ముజే కుచ్ కెహనా హై’ (2001)గా రీమేక్ చేయబడింది. మొదటి చూపులోనే అనుతో ప్రేమలో పడిన బాలు, అతని ప్రేమ విషయాన్ని తనకు చెప్పేందుకు చేసే ప్రయత్నాలను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు కరుణాకరన్. హీరోయిన్ హృదయాన్ని గెలుచుకోవడానికి హీరో ఎదుర్కొనే కష్టాలను అద్భుతంగా చూపించారు.   

వరుస సినిమాలతో అమితాబ్, పవన్ ఫుల్ బిజీ

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్, కమల్ హాసన్‌ తో కలిసి  పాన్-ఇండియన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’లో పని చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తోంది. ఇక  పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేసిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28 విడుదల కానుంది. అటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిస యాక్షన్-అడ్వెంచర్ డ్రామా ‘హరి హర వీర మల్లు’లో కనిపించనున్నారు.  హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ నటిస్తున్నారు.  దర్శకుడు సుజీత్ తో కలిసి ‘OG’ మూవీ చేస్తున్నారు.

Read Also: ‘బిగ్ బాస్’ షో నుంచి వెళ్లిపోతున్నా- సల్మాన్ సంచలన ప్రకటన, అంత కోపం ఎందుకొచ్చింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget