అన్వేషించండి

Vijay attacked: దళపతి విజయ్ మీద చెప్పుతో దాడి - విజయకాంత్ అంత్యక్రియల్లో...

Slipper thrown at Vijay at Vijayakanth’s funeral: తమిళ చిత్రసీమలో అగ్ర హీరో విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన విజయకాంత్ అంత్యక్రియల్లో కలకలం రేపింది.

దివంగత కథానాయకుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు 'కెప్టెన్' విజయకాంత్ (Vijayakanth) గురువారం ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 29న) చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఐలాండ్ మైదానంలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. తమిళ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చారు. అందులో దళపతి విజయ్ కూడా ఉన్నారు. అయితే... అనుకోని ఘటన ఆయనకు ఎదురైంది. 

విజయ్ మీద చెప్పు విరిసిన ఆగంతకుడు!
విజయకాంత్ అంత్యక్రియలకు వచ్చిన విజయ్ మీద గుర్తు తెలియని వ్యక్తి ఒకరు  షూ విసిరిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు వద్దకు విజయ్ వెళుతుండగా ఎవరో షూ విసిరారు. అది ఆయనకు వెనుక నుంచి తగిలింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలో విజయకాంత్‌కు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ... విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరతు ఇడి ముళక్కం', 'సత్తం ఓరు ఇరుత్తరై' సినిమాలతో బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Also Read: డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?

వెండితెరపై విజయకాంత్ ప్రయాణం విజయవంతంగా సాగింది. ఆయన 150కు పైగా సినిమాలు చేశారు. హీరోగా ఆయన వందో సినిమా 'కెప్టెన్ ప్రభాకరన్'. ఆ సినిమా తర్వాత నుంచి విజయకాంత్ (Vijayakanth)ను తమిళ ప్రేక్షకులు అందరూ 'కెప్టెన్ విజయకాంత్' అని పిలవడం ప్రారంభించారు. అంతకు ముందు 'పురట్చి కలైంజర్' (విప్లవ కళాకారుడు) అని పిలిచేవారు.

Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలు మాత్రమే చేశారు. ఆయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోనూ అనువాదం అయ్యాయి. ఎక్కువగా పోలీస్, దేశభక్తి కథాంశాలతో రూపొందిన సినిమాలు చేయడంతో ఆయనను విప్లవ చిత్రాల కథానాయకుడిగా, విప్లవ కళాకారుడిగా ప్రేక్షకులు చూసేవారు. విజయకాంత్ 20కు పైగా సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు. 'ఇనిక్కుమ్ ఇలమై'తో విజయకాంత్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయనది విలన్ రోల్. 

Also Read: విజయకాంత్‌ను చంపేశారు... వాళ్ళను పట్టుకోకపోతే తమిళనాడు మఖ్యమంత్రినీ చంపేస్తారు - దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

విజయకాంత్ వారసులు ఎంత మంది?
Vijayakanth family details: విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. చిత్రసీమలోకి వచ్చిన తర్వాత తన పేరును 'విజయకాంత్'గా మార్చుకున్నారు. ఆయనకు జనవరి 31, 1990లో వివాహం అయ్యింది. ఆయన భార్య పేరు ప్రేమలత. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా 'సప్తగం'. అందులో ఆయన అతిథి పాత్రలో మెరిశారు. ఆ సినిమాతో విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ సినిమాకు విజయకాంత్, ఆయన బావ కె.ఎల్. సుధీశ నిర్మాతలు. ఆ తర్వాత 'మధుర వీరన్' అని మరో సినిమా చేశారు షణ్ముగ పాండియన్. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Varanasi: మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
King Release Date: డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Embed widget