సుమ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన 'బబుల్‌గమ్'లో ప్లస్, మైనస్‌లు ఏంటి? మినీ రివ్యూలో చూడండి!

కథ: కోఠీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల)కు డీజే కావాలనేది లక్ష్యం. డబ్బున్న జాన్వీ (మానసా చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. 

ఆదిని చూసి, అతడితో కొన్ని రోజులు తిరిగిన జాన్వీ కూడా ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి గోవా వెళతారు. 

గోవా నుంచి తిరిగొచ్చాక తన బర్త్‌డేకు ఆదికి ప్రపోజ్ చేయాలని జాన్వీ ఫిక్స్ అవుతుంది. ఆ మాటే పేరెంట్స్‌కు చెబుతుంది.

బర్త్‌డే పార్టీలో ఆది, జాన్వీ మధ్య గొడవ అవుతుంది. కారణం ఏంటి? మళ్ళీ ఇద్దరూ ఒక్కటి అయ్యారా? లేదా? అనేది సినిమా.

ఎలా ఉంది?: 'బబుల్‌గమ్'లో రొమాన్స్, లిప్ లాక్స్ ఎక్కువ... కథలో విషయం తక్కువ. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ బావుంది.

రవికాంత్ పేరేపు క్యారెక్టర్లలో ఉన్న కొత్తదనం కథ, కథనాలు, సన్నివేశాల్లో లేదు. దాంతో బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ!

రోషన్ కనకాల మొదటి సినిమాకు మంచి నటన కనబరిచారు. ఇంటర్వెల్ సీన్ బాగా చేశారు.

గ్లామర్, యాక్టింగ్‌తో మానసా చౌదరి మెప్పిస్తారు. హీరో తండ్రిగా జయరామ్ ఈశ్వర్ బాగా చేశారు.

యూత్, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌లో కొందర్ని ఆకట్టుకునే సినిమా 'బబుల్‌గమ్'. టైటిల్‌కు న్యాయం చేస్తూ సాగదీశారు.

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story