By: ABP Desam | Updated at : 30 Dec 2022 01:58 PM (IST)
రాజమౌళి, ప్రభాస్, విశ్వనాథ్
ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas )... నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోలో ఘాటు కామెంట్స్ చేశారు. అదీ 'RRR' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మీద! అయితే నెగిటివ్ గా కాదు... ఫన్నీగానే లేండి. ఇంతకీ ఏం జరిగిందంటే...
ప్రభాస్ పాత సినిమాల డైలాగులను వినిపించి... ఇదే సినిమానో చెబుతూనే దాని గురించి మాట్లాడాలని బాలకృష్ణ అడిగారు. అలా 'ఛత్రపతి' సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ ను ప్లే చేశారు. దాన్ని విన్న ప్రభాస్... రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
ఫుల్ ఫ్రీడం ఇస్తాడు...
నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు
రాజమౌళి అంటేనే ఫర్ఫెక్షన్ అని, తను అనుకునే ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ వచ్చే వరకూ టేక్ లు తీసుకుంటూనే ఉంటాడని ఉన్న టాక్ కు తను మాత్రమే మినహాయింపు అని చెప్పాడు ప్రభాస్. 'ఛత్రపతి'లో అంత భారీ జనం ముందు గొంతు పెద్దగా చించుకుని అరవలేకపోయేవాడినని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. సిట్యువేషన్ కు తగ్గట్లుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చిన్నగా డైలాగులు చెబుతానని అని రాజమౌళికి చెబితే... 'నీకు నచ్చినట్లు ఫ్రీగా ఉండు! ఫ్రీగా చేయ్' అని జక్కన్న సపోర్ట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. అందుకే జాగ్రత్తగా గమనిస్తే ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ లో అటు ఇటూ తిరుగుతూ నోరు ఆడిస్తున్నట్లు ఉంటుంది తప్ప డైలాగ్ లు చెప్పలేదని... డబ్బింగ్ లో కవర్ చేశానన్నాడు. అప్పటి నుంచి అదే అలవాటుగా మారిపోయిందని, ఇప్పటికే క్రౌడ్ ఎక్కువగా ఉంటే డైలాగులు బిగ్గరగా చెప్పలేనంటూ తన బలహీనతను సైతంగా ధైర్యంగా చెప్పేశాడు ప్రభాస్.
విశ్వనాథ్ ఇదేంటయ్యా అని కోప్పడ్డారు
'ఛత్రపతి' లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చాలా రోజులకు 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా కోసం పని చేసేటప్పుడు లెజండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందన్నాడు ప్రభాస్. అప్పుడు కూడా 'ఛత్రపతి'లో లానే చిన్నగా వినపించుకుండా డైలాగులు చెబుతుంటే సెట్ లో ఉన్న కే విశ్వనాథ్ కోప్పడ్డారని ప్రభాస్ చెప్పాడు. డైలాగులు అనేవి అందరికీ వినపడేలా బిగ్గరగా చెప్పాలని, దాన్ని ప్రాక్టీస్ చేయాలని సలహా ఇచ్చారని, కానీ అదొక్కటే చేయలేకపోతున్నానని ప్రభాస్ చెప్పాడు. తన తండ్రి మొహమాటమే తనకు వచ్చి ఉంటుందన్న ప్రభాస్... తన పెద్దనాన్న కృష్ణం రాజు గారిలా బిగ్గరగా మాట్లాడే అలవాటు వచ్చి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనుకున్నా అన్నాడు.
మిస్టర్ ఫర్ఫెక్ట్ రీ షూట్ చేశాం!
అనుకున్నట్లుగా క్లైమాక్స్ రాకపోవటం... చాలా చోట్ల ఎమోషన్ మిస్ అవటంతో మిస్టర్ ఫర్ ఫెక్ట్ రీ షూట్ చేశామని ప్రభాస్ చెప్పాడు. దిల్ రాజు మంచి సినిమానే రిలీజ్ చేద్దాం అని ఇచ్చిన సపోర్ట్ తో దశరథ్ కాల్ తీసుకుని మళ్లీ కొన్ని సీన్లు చిత్రీకరించాడని గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. ఆ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ వెనుక చాలా కథ జరిగిందన్నాడు. ఫస్ట్ టైం హీరోగా సెట్ అయిపోయాం అనిపించింది మాత్రం వర్షం సినిమాతో అని చెప్పాడు.
Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్ చేసిన ప్రభాస్
'వర్షం' సినిమా చేస్తున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్ గా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. సినిమా డైరెక్టర్ శోభన్ చిన్న వయసులోనే వెళ్లిపోవటం బాధాకరమన్న ప్రభాస్.. .ఆయన తనయుడు సంతోష్ శోభన్ కు ఓ మెంటార్ లా అవసరమైనప్పుడు అండగా ఉంటున్నానని చెప్పాడు. ఇంత పెద్ద హీరో అయ్యాక కూడా... కెరీర్ మొదట్లో సాయం అందించిన ఓ డైరెక్టర్ కుటుంబం కోసం ప్రభాస్ చూపిస్తున్న ఆప్యాయతను బాలయ్య సభాముఖంగా ప్రశంసించారు.
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Kapurthala Bhadas village: పెళ్లిలో వధువులు లెహంగాలు ధరించడానికి వీల్లేదు, రాత్రి 12 దాటితే ఫైన్ - గ్రామపంచాయతీ వింత రూల్స్
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్